శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (13:22 IST)

వెదురు బియ్యం జావతో కీళ్ల నొప్పులు మటాష్ (video)

వెదురు బియ్యంతో చేసిన జావను రోజూ తాగితే కీళ్లనొప్పులు, నడుం నొప్పి తగ్గుతాయి. శరీరంలో వాపులు ఉంటే అవి అదుపులోకి వస్తాయి. మూత్రంలో వచ్చే మంట తగ్గుతుంది. జలుబు, దగ్గు ఎక్కువగా వేధిస్తుంటే వెదురుబియ్యం చూర్ణాన్ని తేనెతో కలిపి పుచ్చుకుంటే నయమవుతుంది. మధుమేహం ఉన్నవారు కొద్ది మొత్తంలో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
 
వెదురు బియ్యాన్ని వంశీలోచన అని కూడా అంటారు. వెదురుకర్ర ముదిరిన తర్వాత వాటికొచ్చే గింజల నుంచే ఈ బియ్యాన్ని సేకరిస్తారు. ఇవి చూడ్డానికి బార్లీ గింజల మాదిరిగా ఉండి, రుచిలో వగరుగా ఉంటాయి. అసోమీలు ఆరోగ్యానికి మంచిదని ఈ బియ్యంతో జావ కాచుకుని తాగుతారు.
 
అలాగే వెదురు బియ్యం ప్రతి కప్పు నుంచి 160 కెలొరీల శక్తి అందుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వుశాతం చాలా తక్కువ. అయితే ఈ బియ్యాన్ని మితంగానే తినాలి. రోజుకి 15 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.