జామ ఆకుల టీని తాగితే.. మధుమేహం పరార్
జామపండులో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి. జామలో ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసే గుణం వుంది. బ్రెస్ట్, మౌత్, స్కిన్, స్టొమక్ క్యాన్సర్లను దూరం చేస్తుంది. జామపండు పేగుల్లో చేరే అనవసరపు కొవ్వును తొలగించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే జామ ఆకులు డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి. జామ ఆకుల టీని తాగితే.. మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.
జామ ఆకుల్లో వుండే పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. జామ ఆకుల టీ ఆకులను తాగితే 12 వారాల్లో ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేగాకుండా ఒబిసిటీని కూడా తగ్గిస్తుంది. జామ ఆకుల టీని తాగితే అజీర్తికి చెక్ పెట్టవచ్చు. ఇంకా టాక్సిన్ల కూడా జామ ఆకుల టీ తొలగిస్తుంది. జామ ఆకులను నీటిలో మరిగించాలి. ఆరిన తర్వాత ఆ నీటితో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు రాలడం వంటి సమస్యలు వుండవని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.