సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (12:17 IST)

డిన్నర్‌‌కు ముందు ఓ గ్లాసుడు వెజ్ సూప్ సిప్ చేస్తే..

డిన్నర్‌ తీసుకునే ముందు ఓ గ్లాస్‌ వెజిటేబుల్‌ జ్యూస్‌ లేదా వెజిటేబుల్ సూప్ సిప్‌ చేస్తే మిగిలిన చిరుతిళ్ళ జోలికి వెళ్ళడం కూడా చాలా వరకు తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు కూడా లభిస్తాయి. కూరగాయలలోని సాల్యుబుల్‌ పీచు, తక్కువ సోడియం శాతాలు అధిక బరువును నియంత్రించడంలో ఎంతో సాయపడతాయి.
 
పాలకూర, కీరా, సొరకాయ వంటివి ఈ జ్యూస్‌లో వుపయోగించినట్లైతే మరింత మంచిది. ఇంకా సోడియం తక్కువగా వుండే వెజిటెబుల్‌ జ్యూస్‌ ప్రతిరోజూ తాగిన వారు 12 వారాల్లో రెండు కేజీల బరువు తగ్గినట్లు తాజా అధ్యయనంలో తేలింది.