గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (17:18 IST)

మధ్యాహ్నం పూట.. పిజ్జా, బర్గర్, సూప్స్ తీసుకుంటున్నారా?

ఆహారం ఆరోగ్యానికి ఔషధం లాంటిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కాబట్టి, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. సాధారణంగా, ఉదయం వేళ కంటే మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మధ్యాహ్నం పూట సూప్స్ తీసుకోకూడదు. 
 
సూప్ రకాలు : మధ్యాహ్నం సమయంలో సూప్ రకాలను తీసుకోకపోవడం మంచిది. కారణం, సాధారణంగా సూప్ రకాలు తీసుకుంటే భోజనం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సూప్స్ ఆకలిని పెంచేస్తాయి. దీంతో ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. తద్వారా బరువు పెరిగిపోతారు. 
 
బర్గర్ : బర్గర్ వంటి స్నాక్ రకాల ఆహారాలను చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు. ఇది అనారోగ్యానికి కారణం అవుతుందిద. ముఖ్యంగా, బర్గర్, పిజ్జా వంటి ఆహారాలను మధ్యాహ్నం సమయంలో తింటే కొవ్వు శాతం పెరిగిపోతుంది. 
 
సలాడ్స్ : చాలా తక్కువ కేలరీలు ఉన్నాయి. ఇది ఉదయం పూట తీసుకోవడానికి మాత్రమే ఉత్తమం. మధ్యాహ్నం పూట తీసుకునేందుకు ఉపయోగపడవు. 
 
శాండ్ విచ్ : బ్రెడ్‌తో తయారు చేసిన ఆహారాన్ని మధ్యాహ్నం పూట తీసుకోకపోవడం మంచిది. కారణం ఇందులో ఎక్కువ స్థాయిలో కార్బోహైడ్రేట్స్ ఉండటం వలన జీర్ణ రుగ్మతలు ఏర్పడతాయి.
 
 
 
నూడుల్స్ : నూడుల్స్ మధ్యాహ్నం భోజనం సమయంలో తినకూడదు. ఇందులోని కార్బోహైడ్రేట్లు బరువును పెంచేస్తాయి.