శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (11:19 IST)

మధుమేహానికి చెక్ పెట్టాలా? చేపలు తినాల్సిందే..

చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమెగా 3 గుండెకు సంబంధించిన జబ్బులను దూరం చేస

చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమెగా 3 గుండెకు సంబంధించిన జబ్బులను దూరం చేస్తుంది. అలాగే చేపలు మధుమేహానికి విరుగుడుగా పనిచేస్తాయి.  
 
ఇకపోతే.. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి శరరీంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కప్పు నీళ్లలో జీలకర్ర వేసి మరిగించి కాసేపయ్యాక వడకట్టి అందులో తేనె, తులసి ఆకులు వేసి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. లోబీపీ ఉన్నవారు జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది. జీలకర్ర జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది.
 
అలాగే మధుమేహ వ్యాధిగ్రస్థులు డార్క్ చాక్లెట్‌ తీసుకోవాలి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లెవనాయిడ్స్ రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తాయి. ఇక.. ఆరెంజ్.. సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్. సిట్రస్ జాతికి చెందిన పండ్లలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.  దీంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ డయాబెటిక్‌ తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.