కరోనావైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఆహార నియమాలు
ఉదయం నిద్ర లేచింది మొదలు వేడి నీరు తరుచు తీసుకుంటూ ఉండాలి. బలహీనంగా ఉన్న వారు అధిక శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. బయట తయారుచేసే ఆహారానికి దూరంగా ఉండాలి. అంతేకాదు శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. ఎక్కువ పోషక విలువలు ఉన్న పదార్ధాలను తీసుకోవాలి.
ఈ క్రింది ఆహార పదార్థాలతో మేలు
1. శరీరానికి అవసరమయ్యే పప్పులు, గ్రుడ్డులు, చేపలు, మాంసం వారానికి నాలుగు లేక అయిదు సార్లు వాడాలి.
2. శాఖాహారులు అన్ని రకాల పప్పు దినుసులు తీసుకోవాలి. ప్రతిరోజు డ్రైప్రూట్స్ తీసుకోవాలి. తినే ఆహారం మోతాదు పెంచాలి.
3. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు. కనుక కొంచెం కొంచెం ఆహారం మోతాదును పెంచడం మంచిది.
4. మూడుపూట్ల భోజనం చేస్తూ మద్యలో చిరుతిండ్లు తినడం మంచిది. అంతేకాకుండా కాయగూరలు, పండ్లు కూడా సమృద్దిగా తీసుకోవాలి. దుంపకూరలు అంటే చామ, కంద, బంగాళదుంపలు మొదలైనవి ఎక్కువగా తినాలి.
5. పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తీసుకోవడం మంచిది. వెన్న, మీగడ కాస్త ఎక్కువగానే తీసుకోవాలి.