వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోరాదు?
ఎండాకాలంలో వేడిని తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడతారు. వడదెబ్బ, నీరసం, ర్యాషస్, దురదలు, ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్య, తిమ్మిర్లు, శక్తిహీనత వంటి లక్షణాలు అనేక మందిలో కనిపిస్తుంటాయి. వేడి వల్ల శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆమ్లెట్‌లు తినకూడదు, చికెన్ దరిచేరనివ్వకూడదు. మసాలాలు అధికంగా వేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలను ముట్టకూడదు. వేడిని నియంత్రించడానికి మజ్జిగ, నీరు అధికంగా త్రాగాలి, నీరు బాగా త్రాగడం వల్ల చిన్న చిన్న రోగాల నుండి తప్పించుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో నీటిని అస్సలు త్రాగవద్దు. అది వేడిని పెంచుతుంది. కుండలో నీరు అన్ని విధాలా శ్రేయస్కరం. అనేక పోషకాలు కూడా అందుతాయి.