మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఆర్. సందీప్
Last Modified: గురువారం, 14 మే 2020 (17:37 IST)

ఎండాకాలంలో చమట వాసన, ఎలా కంట్రోల్ చేయాలి?

ఎండాకాలంలో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ర్యాషస్, చెమట వల్ల శరీర దుర్వాసన చాలా ఇబ్బంది పెడతాయి. ఎన్నిసార్లు స్నానం చేసినా కొంతమందికి తగ్గవు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. 
 
1. ఒక టేబుల్ స్పూన్ తేనెను బకెట్ నీటిలో కలిపి స్నానం చేయండి, దుర్వాసన ఇట్టే పోతుంది. కాటన్ దుస్తులను ధరిస్తే చెమటను పీల్చేస్తుంది, దాని వలన ఇన్ఫెక్షన్‌లు రాకుండా ఉంటాయి.

2. టీ, కాఫీలను ఎక్కువగా త్రాగకండి, వాటి వలన చెమట ఎక్కువగా పడుతుంది.

3. సరైన డైట్‌ని పాటించండి. డైట్‌లో 20 శాతం మాంసకృతులు, మరో 20 శాతం నూనెలు, క్రొవ్వు పదార్ధాలు అదే విధంగా పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. 

4. పుదీనా ఆకులను ఉడికించి స్నానం చేసే నీటిలో కలిపితే, శరీరం తాజాగా ఉంటుంది. సోంపు గింజలు నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, శరీరం దుర్వాసన రాకుండా చూస్తాయి. కాబట్టి రోజూ స్పూను సోంపు గింజలను నమిలి మ్రింగండి.