గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (23:05 IST)

శీతాకాలంలో తీసుకోవాల్సిన పండ్లు (vieo)

శీతాకాలంలో తీసుకోవాల్సిన పండ్లు ఏమిటో తెలుసుకుందాం. ద్రాక్షపండ్లను శీతాకాలంలో తీసుకోవాలి. జనవరిలో పండుతుంది, విటమిన్ సితో నిండి ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి, ఎముకలను పటిష్టం చేయడానికి, గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది. ద్రాక్షపండులో విటమిన్ సి, అలాగే విటమిన్ ఎ నిండి ఉంటుంది. ఈ పండును చక్కెరతో కలిపి తీసుకుంటే బాగుంటుంది.

 
దానిమ్మ టన్నుల కొద్దీ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండటం, కొన్ని క్యాన్సర్ల నివారణలో సహాయపడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. శీతాకాలపు ఆహారంలో దానిమ్మపండ్లను చేర్చుకోండి. ఈ శీతాకాలంలో ప్రయాణంలో ఉన్నట్లయితే, మీరు ఒక గ్లాసు దానిమ్మ రసం కూడా తీసుకోవచ్చు. 

 
నారింజ లేకుండా శీతాకాలపు పండ్ల జాబితా వుండదు. నారింజ రసాలు విటమిన్ డితో నిండి వుంటాయి. అలాగే అరటి పండు. చాలా చౌకగా, సీజన్‌లో ఎల్లప్పుడూ కనిపించేవి అరటిపండ్లు. వీటిలో పొటాషియం పుష్కలంగా వుంటుంది. ఇది ఆందోళన, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. B-6, ఇది కణాలను బలోపేతం చేయడానికి, నిర్మించడంలో సహాయపడుతుంది.

 
పైనాపిల్‌లో విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎముకలు పటిష్టంగా వుండటానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పోషకం. కనుక శీతాకాలంలో ఈ పండ్లను తింటుంటే రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులను నిరోధించవచ్చు.