పాలకు బదులు ఉలవలు, వేరుశెనగలు తీసుకుంటే?
పాలు తీసుకోవడం ఇబ్బందిగా వుంటే..? పాలు తాగినా జీర్ణం కాకపోతే.. దానికి ప్రత్యామ్నాయాలుగా ముడి ధాన్యాలు, కాయధాన్యాలు, పప్పులు తీసుకోవచ్చు. వేరుశెనగ, బాదం, జీడి, పిస్తా వంటివి రోజువారీ డైట్‌లో చేర్చుకుంట
పాలు తీసుకోవడం ఇబ్బందిగా వుంటే..? పాలు తాగినా జీర్ణం కాకపోతే.. దానికి ప్రత్యామ్నాయాలుగా ముడి ధాన్యాలు, కాయధాన్యాలు, పప్పులు తీసుకోవచ్చు. వేరుశెనగ, బాదం, జీడి, పిస్తా వంటివి రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే.. పాలలోని క్యాల్షియం అవసరాలను తీర్చుకోవచ్చు.
వేరుశెనగ పప్పు క్యాల్షియాన్ని పుష్కలంగా కలిగి వుంటుంది. వేరు శెనగలను పచ్చిగా స్వీకరిస్తే సంపూర్ణ ఆహారమవుతుంది. వేరుశెనగని కనీసం ఆరు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. దీనివల్ల పిత్తానికి సంబంధించిన అంశాలు పక్కకు వెళిపోతాయి. నానబెట్టని వేరుశెనగలను ఎక్కువ తీసుకోకూడదు.
అదేవిధంగా ఉలవలు కూడా పాలకు తగిన ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఉలవలు ఐరన్, క్యాల్షియంలకు మంచి వనరు. ఇది శాకాహారం ద్వారా అందే మంచి ప్రోటీన్లకు అత్యుత్తమమైన వనరు. క్యాల్షియం, ఐరన్ ఇతర రసాయాన పదార్థాలతో కలిసి ఉండడం వల్ల, శరీరం వీటిని తేలిగ్గా స్వీకరించలేదు. ఉలవల్ని మొలకెత్తించడం ఒక సులువైన పధ్ధతి. ఈ ప్రక్రియ ఐరన్, క్యాల్షియంల లభ్యతని పెంచడం వల్ల ఉలవల పోషక విలువ బాగా పెరుగుతుంది.
అంతేకాక, మొలకెత్తిన ఉలవలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఉలవలు శరీరంలోని ఉష్ణాన్నిపెంచుతాయి. దీనివల్ల వానాకాలం, శీతాకాలంలో దగ్గు, జలుబును పక్కనబెట్టేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.