సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (19:32 IST)

మాడు నొప్పి నివారణకు (video)

తలనొప్పి వేరు, మాడు నొప్పి వేరు. ఒక్క మాడుభాగంలోనే ఇది వస్తుంది. బస్సు ప్రయాణాలలో, షాపింగులలో, ఎండలో తిరిగేటప్పుడు, టెంన్షన్ వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంది.

మంచినీళ్ళు తక్కువగా త్రా గి తిరిగే వారికి శరీరంలో నీరు చాలక, తలకు అందవలసిన రక్త ప్రసరణ అందక, రక్తంలో నీరు తగ్గడం వలన మాడు భాగం వేడెక్కువై మాడు నొప్పి వస్తుంది.

రేడియేటర్ నీళ్ళు తగ్గితే ఇంజన్ వేడెక్కినట్లే మనకు మాడు భాగం వేడెక్కుతుంది. పైన చెప్పిన సందర్భాలలో మూత్రం వస్తుందని నీరు త్రాగక తిరిగి నందుకు మాడు నొప్పి వస్తుంది. ..
 
చిట్కాలు:-
1) ఎప్పుడూ మాడునొప్పి అనిపించినా వెంటనే మాడుపై నీళ్ళతో తడిపి, కుదిరితే చేతిగుడ్డ తడిపి ఉంచుకోవచ్చు. 
2) పగలు మాడు నొప్పి వస్తే సాయంకాలం తలస్నానం చేయడం మంచిది. 
3) రోజూ నీరు బాగా త్రాగాలి. కూడా సీసా ఉంచుకుని కొంచెం కొంచెం పైన చెప్పిన సందర్భాలలో త్రాగితే మంచిది. మూత్రం రాదు. మాడు నొప్పి రాదు.