శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 7 ఆగస్టు 2024 (23:04 IST)

ఎండబెట్టిన అత్తి పండ్లను తింటే కలిగే ప్రయోజనాలు

అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము.
 
అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి.
అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది
అత్తి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, అసిడిటీని నివారిస్తుంది.
అత్తి పండ్లను, వాటి ఆకులలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని సమతుల్యం చేస్తాయి.
భోజనానికి ముందు, ఆ తర్వాత సరైన మోతాదులో అంజీర పండ్లను తినడం వల్ల పైల్స్ వంటి వ్యాధులు నయమవుతాయి.
పురుషులు అత్తి పండ్లను తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
అత్తిపండ్లలో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
అంజీరలో వుండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమ సమస్యల నుండి బైట పడేస్తాయి.