మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (15:42 IST)

రోజూ గుప్పెడు వాల్‌నట్స్ పలుకులు తింటే?

రోజూ గుప్పెడు వాల్‌నట్స్ పలుకులు తింటే? మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. వీటిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ హృదయ, మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకారి. ఇది వార్ధక్యంలో వేధించే అల్జీమర్స్ వ్యాధిని నిరోధించడంలోనూ, తీవ్రత తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. 
 
అంతేగాకుండా.. కొలెస్ట్రాల్ మోతాదును కూడా తగ్గించే గుణం కలిగి ఉంది. అందుచేత వాల్‌‌నట్స్‌ను రోజుకు రెండేసైనా తీసుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేవాళ్లు బాదం, పిస్తాతో పాటు వాల్‌నట్స్‌ను కూడా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్ తీసుకునే అలవాటున్నవారు ఇకపై వాల్ నట్స్ అనే ఆక్రోటును కూడా డైట్ లిస్టులో చేర్చుకోవాలి. వారానికి రెండు మూడుసార్లు ఆక్రోటు తినే వారికి మధుమేహం సోకే అవకాశాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.