బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 నవంబరు 2019 (16:30 IST)

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఒకే ఒక్క టీ.. ఏంటది?

ప్రతి ఇంట్లో కనిపించే మందార మొక్కలో ఎన్నో ఔషధ విలువలు దాగి వున్నాయి. మందార పూలు వాడి ఔషధ టీ తయారుచేస్తారు. మందార పువ్వులోని ఆకర్షణ పత్రాలను నీటిలో బాగా కడిగి ముందుగా మరగపెట్టిన పాలు లేదా టీలో వేసి ఆ టీ రంగు మారేదాకా వేచి ఉండి అప్పుడు తాగాలట.
 
దీంతో అందులోని పలు రకాల పోషక పదార్థాలు, అధిక శాతం ఐరన్, విటమిన్లు మేలు చేస్తాయట. ఈ టీ తాగితే హైపర్ టెన్షన్ తగ్గుతుందట. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుందట. అలాగే రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుందట. మందార టీ, షుగర్ జబ్బున్న వారికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
 
ఎందుకంటే దీనిలో యాంటీఆక్సిడెంట్ల వల్ల కాలేయ ఆరోగ్యం కాపాడుతుందట. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. డిప్రెషన్‌కి గురయ్యే వారికి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువును నియంత్రించడంలో బహిష్టు నొప్పుల నివారణలోనూ మందార టీ ఔషధంగా పనిచేస్తుందట.