గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (18:07 IST)

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

honey
తేనెతో చర్మం మెరిసిపోతుంది. తేనెను ముఖానికి పెట్టడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. ముఖానికి తేనెను పెడితే దాన్ని 15 లేదా 20 నిమిషాలకు మించి ఉంచకూడదు. ముఖానికి తేనె రాసుకోవడానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేయండి. తర్వాత కాటన్ తీసుకుని తేనెలో ముంచండి. ఇప్పుడు దీంతో ముఖానికి తేనెను పెట్టండి. 
 
తేనెను నేరుగా ముఖానికి వాడకూడదు. ఎందుకంటే దీనివల్ల ముఖం జిగటగా మారుతుంది. అందుకే తేనెలో కొద్దిగా అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ మిక్స్‌ను ముఖానికి అప్లై చేయండి. తేనెను ముఖానికి పెట్టిన తర్వాత చేతులతో ముఖాన్ని కాసేపు మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.