మూడో శ్రావణ శుక్రవారం... పంచమి కూడా వచ్చేస్తోంది..
శ్రావణమాసం అందులోను శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఫలప్రదం అవుతుందని భక్తుల విశ్వాసం. శ్రావణమాసం మూడో శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించాలి.
ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెలుపు, ఎరుపు రంగు పువ్వులు అమ్మవారికి సమర్పించాలి. గులాబీ పువ్వులు, తామర పువ్వులు సమర్పించవచ్చు.
సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీలక్ష్మిని పూజించవచ్చు. శ్రావణ శుక్రవారం మొక్కలు నాటడం వల్ల సంపద పెరుగుతుంది. శుక్రవారం రోజుల్లో డబ్బు దానం చేయడం శుభప్రదం.
ఇంకా శ్రావణ శుక్రవారం పంచమి కలిపి రావడంతో.. ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు.
ఇంకా "ఓం శ్రీ పంచమి దేవియే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఇంట సుభిక్షానికి కొదవవుండదు. రుణబాధలుండవు. దారద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.