మంగళవారం, 27 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (19:51 IST)

రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపరుచుకునేందుకు...

శరీరంలోని  అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగా ఉండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చిన ఏదో సమస్యకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదు. మన శరీరంలోని రక్తాన్ని మనమే శుభ్రం చేసుకోవచ్చు. అదెలా అంటే.. 
 
ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే మంచిదట. వారానికి రెండు, మూడు సార్లు బీట్‌రూట్‌ను ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్టయితే శరీరములోని అధిక బరువును తగ్గిస్తుందట. 
 
అలాగే, రాత్రిపూట నిద్రకు ఉపక్రమించేందుకు కనీసం రెండు, మూడు గంటలకు ముందు ఆహారాన్ని తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందట. అలాగే, మునగాకుతో కాస్త కందిపప్పు, మరియు ఒక కోడిగుడ్డు, కొంచెం నెయ్యి చేర్చి తయారు చేసిన వంటను 41 రోజులు తీసుకున్నట్టయితే శరీరములోని రక్తము శుభ్రపడుతుందని నాటు వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, అల్లంరసంతో కాస్త తేనె కలిపి తిన్నట్టయితే రక్తమును శుభ్రపరచును. తినే ఆహారంల్లో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి కలిపి తిన్నట్టయితే శరీరములోని క్రొవ్వును తగ్గించి ఉత్సాహమును పెంచుతుందట.