మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:32 IST)

పళ్లు ఎందుకు పుచ్చిపోతాయి?

hammer - teeth
చాలా మందికి పళ్లు పుచ్చిపోతుంటాయి. మరికొందరికి చిగుళ్లు ఎపుడూ వాచిపోతూ ఉంటాయి. సరైన ఆహారం తినకపోవడమే ఈ లక్షణాలకు కారణమని వైద్యులతో పాటు పౌష్టికాహార నిపుణులు చెబుతుంటారు. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాలంటే ఎలాంటి ఆహారం తినాలో వారు చూసిస్తున్నారు. అలాంటి చిట్కాల్లో కొన్నింటిని తెలుసుకుందాం. 
 
కూరగాయలు, పళ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది పళ్లపై ఉన్న బ్యాక్టీరియాను, పాచిని తొలగించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు యాపిల్స్‌లో ఉండే మాలిక్ యాసిడ్ - పళ్లపై పొరను శుభ్రం చేస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే విటమిన్లు.. ఇతర పోషక పదార్థాలు పళ్లను, చిగుళ్లను బలోపేతం చేస్తాయి.
 
పాలు, పెరుగు, చీజ్ వంటి పదార్థాల్లో కాల్షియం, పోస్ఫరస్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బలమైన పళ్లకు, చిగుళ్లకు మేలు చేస్తాయి. చేపల్లో ఓమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చిగుళ్లు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి.
 
డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిలో ఉండే పాడుకుండా ఉపయోగిస్తాయి. అంతేకాకుండా ఇవి పళ్లపై బ్యాక్టీరియా చేరకుండా కాపాడతాయి. ప్రతి రోజు ఆహారం తిన్న తర్వాత కొన్ని పదార్థాలు నోటిలో ఉండిపోతాయి. వీటిని వెంటనే శుభ్రం చేసుకోపోతే రకరకాల సమస్యలు ఏర్పడతాయి. దీనితో పాటుగా తరచూ నీటిని తాగుతూ ఉంటే నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇవి నోటిని శుభ్రం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
 
చూయింగ్ గమ్స్‌ను తినటం వల్ల కూడా లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే చ్యూయింగ్ గమ్‌లో చక్కెర ఉంటుంది. అందువల్ల సుగర్ ఫ్రీ చ్యూయింగ్ గమ్‌ను తినటం మంచిదని పౌష్టికార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.