గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (16:45 IST)

హార్మోన్లను ఏ విధంగా గాడిలో పెట్టాలంటే...

foods
హార్మోన్ సమస్యలు సంక్రమించడానికి కారణాలు యాభై శాతం జన్యుపరమైనవైతే మరో యాభై శాతం జీవనశైలి సంబంధంగా ఉంటాయి. అయితే హార్మోన్లలో అవకతవకలు తలెత్తడానికి ఒత్తిడి ప్రధాన కారణం కాబట్టి ధ్యానం, యోగాలతో ఒత్తిడిని తగ్గించుకోవాని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శారీరకంగా చురుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. 
 
వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి. ఇందుకోసం వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఇష్టమైన ఆటలు ఆడడంలాంటి వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకుంటూ ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. 
 
వీటితో పాటు అధిక మోతాదులో నీళ్లు తాగడం, ఊపిరి పీల్చుకోవడం, మంచి నాణ్యమైన నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, కూరగాయలు వంటివి ఆరగించడం, చక్కెర లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంచడం వంటివి చేయడం వల్ల శరీరంలోని హార్మోన్లను నియంత్రణలో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.