మంగళవారం, 27 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (12:37 IST)

ఒత్తిడితో చిక్కులెన్నో.. ధ్యానం చేయడం.. నీళ్లెక్కువ తాగితే?

ఒత్తిడితోనే పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. రక్తపోటు స్థాయిని ఒత్తిడి పెంచేస్తుంది. తద్వారా నరాలు బాగా విపరీతమైన నొప్పికి గురవుతాయి. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఏ పనినైనా శ్రద్ధతో చేయలేరు. తలబరువ

ఒత్తిడితోనే పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. రక్తపోటు స్థాయిని ఒత్తిడి పెంచేస్తుంది. తద్వారా నరాలు బాగా విపరీతమైన నొప్పికి గురవుతాయి. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఏ పనినైనా శ్రద్ధతో చేయలేరు. తలబరువుగా, భారంగా, చేతులు లాగడం జరిగితే అది కచ్చితంగా రక్తపోటుకు దారితీస్తుంది. ఒత్తిడిలో వున్నప్పుడు ధ్యానం చేయండి. ఎక్కువగా నీరు త్రాగాలి. ఇందువల్ల నరాల్లో రక్త ప్రసరణ జరిగి తగ్గుతుంది.
 
అంతేకాక హైపెర్ టెన్షన్‌కు కూడా తలనొప్పి, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనబడతాయి. ఈ సమస్య ఆల్కహాలు సేవించడం, ధూమపానం చేయటం, అతిగా ఒక విషయాన్ని ఆలోచించటం, మానసిక శారీరక ఒత్తిళ్ళు వలన ఇలా శరీరం అస్థిరతకు గురవుతుంది. 
 
హైపర్ టెన్షన్ తగ్గాలంటే.. పొద్దున్నే యోగా చేయాలి. ఒత్తిడికి లోనుకాకూడదు ఈ సమస్య నుంచీ బయటపడేందుకు వ్యాయామాన్ని అలవరచుకోవాలి, జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. కుటుంబ సభ్యుల, స్నేహితుల నుంచి చేయూత తీసుకోవాలి. నచ్చిన క్రీడలు, నచ్చిన ప్రాంతాలు వెళ్లడం అలవాటు చేసుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.