గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (18:55 IST)

వేసవి తాపానికి ఐస్ వాటర్ తాగుతున్నారా..?

వేసవి తాపానికి ఐస్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ కథనం చదవండి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నీటిని తాగడం వల్ల పేగులు కుచించుకుపోతాయి. తరచుగా తాగుతూ అలవాటుగా చేసుకుంటే పేగులు కుచించుకుపోయి జీర్ణాశయ సమస్యలకు దారి తీస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల మలబద్దకం ఏర్పడుతుంది. 
 
శరీర కణాలు కుచించుకుపోవడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశమూ ఎక్కువే. మలబద్ధకం సమస్య తప్పదు. ఫ్రిజ్‌లో ఉంచిన నీళ్ళు తాగడం వల్ల వచ్చే మరో సమస్య, గొంతునొప్పి. దీనివల్ల టాన్సిల్స్ ఏర్పడే అవకాశమూ ఎక్కువే. అలాగే శరీరం తొందరగా అలసటకు గురవుతుంది. 
 
జీవక్రియపై ప్రభావం పడడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. అపుడు శరీరంపై పోషకాల లోపం ఏర్పడి ఇతర ఇబ్బందులు కలుగుతాయి. అందుకే వేసవిలో రిఫ్రిజిరేటర్లోని నీళ్ళు దాహం తీర్చినా ఆరోగ్యానికి మంచివి కావు. కాబట్టి, వాటికి అలవాటు పడకుండా ఉండడమే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.