గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 15 నవంబరు 2018 (14:42 IST)

కాఫీ తాగితే నష్టం... లాభం... అవేంటో చూడండి...

కాఫీ తాగటం అనేది జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఒక్కపూట ఆహారం లేకుండానైనా ఉండగలరేమో కానీ, కాఫీ లేనిదే గడవని పరిస్థితి చాలామందిలో నెలకొని ఉంది. ఈ విధంగా నిత్య జీవితంలో కాఫీకి, మనిషికి, అంత గట్టి బంధం ఏర్పడింది. కాఫీ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే...
 
1. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల గుండెపోటుకు దారి తీసే హానికరమైన ఎంజైములు నశిస్తాయి. ఇది రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది.
 
2. రోజుకు మూడు కప్పుల కాఫీ త్రాగేవారిలో ఉబ్బసం వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది. 
 
3. కాఫీ డికాక్షన్ సేవించటం వల్ల జలుబు, దగ్గు, అతి నిద్ర, మూత్రం సాఫీగా నడవక పోవటం లాంటి లక్షణాలు తగ్గుతాయి.
 
4. కొన్ని రకాల మందులు తీసుకున్నప్పుడు వాంతి వచ్చినట్టుండే అనుభూతిని కాఫీ తగ్గిస్తుంది.
 
కాఫీని అతిగా తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే.....
 
1. రోజు ఉదయం టిఫిన్ తర్వాత, సాయంకాలం తక్కువ గాఢత ఉన్న కాఫీ తాగటం వల్ల హాని కలుగదు. అయితే రోజులో ఎక్కువసార్లు కాఫీ తాగే వారికి జీర్ణశక్తి తగ్గి పోవడం, ఆకలి లేక పోవడం, గ్యాస్ట్రిక్ అల్సర్, రక్తపోటు, గుండె దడ, నిద్రలేమి, తలనొప్పిలతో పాటు వార్ధక్య లక్షణాలు కూడా త్వరగా కలుగుతాయి.
 
2. పిల్లలకు ఎటువంటి పరిస్థితులలో కూడా కాఫీని అలవాటు చేయకూడదు. దీనివల్ల వారి పెరుగుదల నిరోధించబడుతుంది. 
 
3. పరగడుపున తీసుకున్న కాఫీలోని కెఫిన్ జీర్ణకోశం నుంచి రక్తంలోకి చాలా త్వరగా వ్యాపించి తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.