బెల్లం అంత మేలు చేస్తుందా?
పంచదారకు బదులు బెల్లంను తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం మన శరీరంలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది. రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు తొలగిపోతాయి. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి.
కండరాల నిర్మాణం సరవుతుంది. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉంటుంది. ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బెల్లంలో యాంటీఆక్సిడెంట్స్, జింక్, సెలెనియం లాంటి ఖనిజాలుంటాయి. ఇవి సూక్ష్మక్రిముల ద్వారా శరీరానికి జరిగే హానిని అరికడతాయి. ఇన్ఫెక్షన్ల నుంచీ శరీరాన్ని కాపాడతాయి.
బెల్లంలో అధిక సంఖ్యలో ఉండే పోషకాలు... పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను దూరం చేస్తాయి. పీరియడ్స్ తర్వాత అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు రోజూ కొద్ది మొత్తంలో బెల్లం తీసుకుంటే మంచిదే. బెల్లం నుంచీ విడుదలయ్యే ఎండోర్ఫిన్స్, శరీరానికి నొప్పుల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి