శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (23:05 IST)

కర్బూజ పండు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

kharbuja
వేసవిలో ప్రత్యేకంగా కర్బూజ పండును తింటుంటారు. ఈ పండు తింటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. ఈ పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
కర్బూజలో బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
కర్బూజ పండులో విటమిన్ ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
కర్బూజలో విటమిన్ కె, ఇ  వుండటం వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
కర్బూజలో ఫోలెట్ ఉండటం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.
కర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.
కర్బూజ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.