శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (16:23 IST)

ఆఫీసుల్లో అదేపనిగా కూర్చుని పనిచేస్తున్నారా..?

ఆఫీసుల్లో అదేపనిగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండె జబ్బులు బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడేందుకు ప్రధానం కారణాలని ఈ అధ్యయనం చెబుతోంది.
 
వీటన్నింటితో పాటు రోజువారి జీవన విధానం కూడా మధుమేహం ముప్పు పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. దీనికోసం ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ సమస్య ఉండదని అనుకుంటుంటారుగానీ.. నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వలన కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని వారు చెబుతున్నారు. 
 
గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా.. వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, ఆటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం వంటివి చేస్తే ఎంతో మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.