శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (13:39 IST)

రక్తహీనత ఎదుర్కొనేందుకు చింతపండును తీసుకుంటే?

చింతపండు పులుపు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని కొందరి అభిప్రాయం. ఇది తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చింతపండును ఆహారంలో తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలు తప్పించుకోవచ్చని పరిశోధనలో తెలియజేశారు. చింత

చింతపండు పులుపు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని కొందరి అభిప్రాయం. ఇది తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చింతపండును ఆహారంలో తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలు తప్పించుకోవచ్చని పరిశోధనలో తెలియజేశారు. చింతపండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలగా లభిస్తుంది. దీని ద్వారా లభించే గుజ్జులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
 
శరీర ఆరోగ్యానికి హాని కలిగించే రాడికల్స్‌తో ఇది సమర్థవంతంగా పోరాడుతుందని చెబుతున్నారు. చింతపండులోని పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదపడుతాయని చెప్పబడుతోంది. ఇవే కాకుండా దీనిలో లభించే పొటాషియం, మినరల్స్, విటమిన్స్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతాయి.
 
జ్వరంతో బాధపడేవారికి చింతపండు చారును తీసుకుంటే మంచిది. చింతపండు త్వరగా జీర్ణమవుతుంది. చింతపండులో ఐరన్ శాతం కూడా చాలా ఎక్కువ. దీని వలన శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. ఆ రక్తహీనత కారణంగా వచ్చే నీరసం, తలనొప్పులు దూరమైపోతాయి.