ఆదివారం, 19 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 13 అక్టోబరు 2024 (20:15 IST)

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

image
భారతదేశంలో 101 మిలియన్లకు పైగా మధుమేహంతో బాధపడుతున్న దేశం ప్రపంచానికి మధుమేహ రాజధానిగా అవతరించింది. ఫలితంగా, మధుమేహ సంబంధిత నివారించగల దృష్టి నష్టం ఉనికిలో తీవ్రస్థాయి పెరుగుదల గమనించబడింది. డయాబెటిక్ రెటినోపతిని సకాలంలో పరీక్షించడంలో, దాని నిర్వహణ కోసం నేత్ర వైద్యుడిని సంప్రదించడంలో డయాబెటాలజిస్ట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. విట్రియో రెటినాల్ సొసైటీ ఆఫ్ ఇండియా (VRSI), రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (RSSDI) భారతదేశంలోని ప్రతి వైద్యుడు, డయాబెటాలజిస్ట్ వారి రోగులకు డయాబెటిక్ రెటినోపతి గురించి అవగాహన కల్పించడంలో సహాయపడేలా ఈ తరహాలో మొదటిదైన డయాబెటిక్ రెటినోపతి స్క్రీ నింగ్ మార్గదర్శకాలను రూపొందించడానికి కలసి పని చేశాయి.
 
జీవనశైలి మార్పులు, నగరాలకు వలసలు, ఊబకాయం, ఒత్తిడి కారణంగా దేశంలో మధుమేహ వ్యాధిగ్ర స్తుల సంఖ్య పెరుగుతోంది, దీనికి సమాంతరంగా మధుమేహ సంబంధితంగా దృష్టి కోల్పోయే కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. టైప్ -2 మధుమేహం పని చేసే వయస్సులో ఉన్నవారిలో సాధారణం. అది వారి శారీ రక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితిని సకాలంలో పరీక్షించకపోతే భారతదేశంలో అంధత్వానికి ప్రధాన కారణం కావచ్చు. దీనివల్ల ఆయా కుటుంబాలపై, దేశంపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. దేశంలో మధుమేహవ్యాధిగ్రస్తుల్లో 12.5% మంది డయాబెటిక్ రెటినోపతి కలిగిఉన్నారు. 4% మంది దృష్టి కి ముప్పు కలిగించే 'డయాబెటిక్ రెటినోపతి'తో బాధపడుతున్నారు. ఈ లెక్కన సుమారు 30 లక్షల మంది భారతీయులు దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని 'నిశ్శబ్ద చూపు దొంగ' అని కూడా వ్యవహరిస్తుంటారు. తిరిగి సవరించలేని విధంగా దృష్టిని కోల్పోవడాన్ని నిరోధించడానికి మధుమేహం ఉన్న ప్రతి రోగి సకాలంలో స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన క్లిష్టమైన అవస రాన్ని ఇది ప్రముఖంగా చాటిచెబుతుంది.
 
డయాబెటిక్ రెటినోపతి కారణంగా సంభవించే తీవ్రమైన దృష్టి లోపం, అంధత్వానికి సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడం, ముందస్తుగా గుర్తించడం, జోక్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన సాధనాలు, జ్ఞానంతో తరచుగా డయాబెటిస్‌తో జీవించే వారికి మొదటి సంప్రదింపు కేంద్రంగా ఉండే ఆరోగ్య సంరక్షణ నిపుణులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
 
భారతదేశంలోని వైద్యులకు సంబంధించి డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ మార్గదర్శకాలు: దిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పరిశ్రమ ప్రముఖ నాయకులతో కలసి వీఆర్ఎస్ఐ, ఆరె స్సెస్డీఐ ఈ ప్రకటన విడుదల చేశాయి. డాక్టర్ సుధా చంద్రశేఖర్ (మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ అథారిటీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ), డాక్టర్. ఆర్. కిమ్(ప్రెసిడెంట్, వీఆర్ఎస్ఐ), డాక్టర్ మనీషా అగర్వాల్ (జనరల్ సెక్రటరీ, వీఆర్ఎస్ఐ), డాక్టర్ రాకేష్ సహాయ్ (ప్రెసిడెంట్, ఆరెస్సెస్డీఐ), డాక్టర్ సంజయ్ అగర్వాల్ (సెక్రటరీ జనరల్, ఆరెస్సెస్డీఐ) సెషన్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశంలో డయాబెటిక్ రెటినోపతి స్థితి, అమల్లో ఉన్న సిఫార్సుల ద్వారా అంతరాలను భర్తీ చేయడం గురించి వివరించారు.
 
టేబుల్ 1: భారతదేశంలోని వైద్యుల కోసం డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ మార్గదర్శకాలు: విట్రొరెటినల్ సొసైటీ ఆఫ్ ఇండియా (వీఆర్ఎస్ఐ), రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆరెస్సె స్డీఐ) ద్వారా పొజిషన్ స్టేట్ మెంట్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హెల్త్ అథారిటీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-డాక్టర్ సుధా చంద్రశేఖర్ ఇలా అన్నారు, “మధుమేహంతో బాధపడుతున్న మిలియన్ల మంది భారతీయుల దృష్టిని రక్షించడానికి, డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్‌ను ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చింది. జాతీయ స్థాయిలో ముందస్తుగా గుర్తించడానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కంటిచూపును సంరక్షించడం, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకం లబ్ధిదారులకు డయాబెటిక్ రెటినోపతి స్క్రీ నింగ్ ప్రత్యేకించి ప్రయోజనకరంగా ఉంటుంది. డీఆర్ యొక్క ముదిరిపోతున్న దశల నిర్వహణలో అధిక ఖర్చులను నివారించడంలో, మెరుగైన ఆరోగ్య ఫలితాలను నిర్ధారించడంలో సహాయపడుతుంది.’’
 
వీఆర్ఎస్ఐ  ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ కిమ్ ఇలా వ్యాఖ్యానించారు, “ఈ మార్గదర్శకాలను సమిష్టిగా ఆవిష్కరించడం, భారతదేశంలో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ కోసం ఒక కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేయడం పట్ల మేం సంతోషిస్తున్నాం. వైద్యులు, డయాబెటాలజిస్టులు, నేత్రవైద్యుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా మేం మెరుగైన మధుమేహ నిర్వహణను ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా నివారించ గల దృష్టి నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాం.’’
 
డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ ప్రాముఖ్యతను వీఆర్ఎస్ఐ జనరల్ సెక్రటరీ డాక్టర్. మనీషా అగర్వాల్ ప్రముఖంగా చాటిచెప్పారు. ‘‘డయాబెటిక్ రెటినోపతి ప్రాబల్యం పెరుగుతున్నప్పటికీ, పరిమిత అవగాహన, తరచుగా లక్షణరహిత స్వభావం కారణంగా కంటి పరీక్షలు కోరుకునే వ్యక్తుల సంఖ్య నిరాశాజనకంగా ఉంది. కంటి స్క్రీనింగ్‌లు డయాబెటిక్ రెటినోపతి కారణంగా చూపు కోల్పోవడం, సకాలంలో స్క్రీనింగ్, నిర్వహణ అవసరం గురించి అవగాహన పెంచడం అత్యవసరం’’ అని అన్నారు.
 
"భారతదేశంలో, మధుమేహంతో జీవిస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను పర్య వేక్షించడం మాత్రమే కాకుండా, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మధుమేహంతో సంబంధం ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు చేయడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. డయాబెటిక్ రెటినోపతి అటువంటి సమస్యనే. చికిత్స చేయకపోతే, తీవ్రమైన, తరచుగా కోలుకోలేని దృష్టిని కోల్పోవడానికి కారణం కావచ్చు, ఈ మార్గదర్శకాలు సాధారణ వైద్యులు, డయాబెటాల జిస్టులలో సకాలంలో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ గురించి అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి" అని ఆరెస్సెస్డీఐ సెక్రటరీ జనరల్ డాక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.
 
ప్రఖ్యాత ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్‌ ఇన్ డెవలపింగ్ కంట్రీస్‌లో ప్రచురించబడిన ఈ మార్గదర్శకాలు సమగ్ర గణనగా పనిచేస్తాయి. డయాబెటిస్ నిర్వహణ, డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి కోసం స్క్రీనింగ్‌ను సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి భారతదేశ ప్రయాణంలో కీలకమైన మైలురాయిని సూచిస్తాయి.