మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 డిశెంబరు 2025 (10:39 IST)

ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తీరు మారలేదు, దమ్ముంటే రా తేల్చుకుందాం: రేవంత్ రెడ్డి

revanth reddy
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైలి శైలిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న ఎలుకలా వుండి ఇప్పుడు బైటకు వచ్చి మాట్లాడుతున్నారు. కేసీఆర్ మారి వుంటాడని అనుకున్నా. ఆయనలో ఏ మార్పు రాలేదు. పదేళ్ల పాలనలో తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి కమీషన్లు దండుకున్నారు.
 
అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. దమ్ముంటే జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలి. అక్కడే తేల్చుకుందాం ఎవరు తెలంగాణను దగా చేసారో. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ఆయన తీరు మారలేదు. ప్రజల పక్షాన నిలబడతా అని చెప్పుకునే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, ఏదో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అన్నీ అబద్ధాలు మాట్లాడితే సరిపోదని అన్నారు.