గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:22 IST)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడని పండ్లు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా వారి ఆహారంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వ్యాధిని అదుపులో వుంచుకోవడానికి ముఖ్యమైన అంశం. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని వైద్యులు ప్రతిసారి చెపుతుంటారు.

 
చక్కెర కలిగిన డెజర్ట్‌లు, పానీయాలు, అధిక కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్ధాలు వంటి కొన్ని ఆహార పదార్థాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. అలాగే సహజ చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. జామపండ్లు వంటి కొన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివని తెలిసినప్పటికీ, చాలా తీపిగా ఉండే మరికొన్నింటికి దూరంగా ఉండాలి.

 
అధిక చక్కెర స్థాయిలు ఉన్న పండ్లను నివారించడం ఎల్లప్పుడూ మంచిది. అన్ని పండ్లలో సహజమైన చక్కెర ఉంటుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యగా ఉంటుంది. మామిడిపండ్లు తినరాదని చెప్తారు. అలాగే సపోటా పండ్లకు కూడా దూరంగా వుండాలని చెప్తారు. మిగిలిన దాదాపు అన్ని పండ్లను మితమైన పరిమాణంలో తీసుకోవచ్చు.