1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (19:24 IST)

బాదం వెన్న పేస్టు తింటే ఏం జరుగుతుంది? (video)

Almonds
బాదం వెన్న పేస్ట్ ఆరోగ్యకరమైనది. బాదం, ఉప్పు, నూనెతో కూడిన పేస్టులో విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు ఉంటాయి. ఇది ప్రోటీన్‌లో అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా బాదంపప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఒక చెంచా బాదం వెన్న పేస్ట్ రోజంతా భారీ శక్తిని ఇస్తుంది.

 
పోషకాహార నిపుణులు నేడు వేరుశెనగ వెన్న వంటి ఇతర స్ప్రెడ్‌ల కంటే బాదం వెన్నను సిఫార్సు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, దానిలో వున్న కొవ్వు పదార్ధం హృదయ ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఎక్కువ ఉప్పు కూడా ఉండదు. కానీ ఇది మోతాదుకు తగినంత కొవ్వును కలిగి ఉంటుంది. కాబట్టి రోజుకు ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకుండా చూసుకుంటే సరిపోతుంది.

 
బాదం వెన్న పేస్టును తినడానికి సులభమైన మార్గం ఏమిటంటే, గోధుమ రొట్టెతో కలిపి తినడం. గుమ్మడికాయ, క్యారెట్‌తో చేసిన సూప్‌లతో బాదం వెన్న పేస్టును కలిపి తినవచ్చు.