సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (12:24 IST)

మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేసే బేరిపండ్లు

Pear
Pear
మధుమేహం వ్యాధిగ్రస్థులకు బేరిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులో విటమిన్ సి పోలేట్ పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు రుచి తీపిగా ఉంటుంది. దీనిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన, ఎన్నో వ్యాధుల బారి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
అందువలన ఈ వర్షాకాలంలో ఈ బేరి పండును రోజుకు ఒకటి తినాలని వైద్యులు చెప్తున్నారు. ఈ పండు తినడం వలన క్యాన్సర్ నుంచి గుండెపోటు నుంచి అలాగే మలబద్ధకం నుంచి కొలెస్ట్రాల్ నుంచి ఈ పండు కాపాడుతుంది. ఈ పండును ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తీసుకోకూడదు. 
 
ఈ పండు తీసుకోవడం వలన రక్తములో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. 
 
మధుమేహం వ్యాధిగ్రస్థులు చక్కెర స్థాయి కంట్రోల్‌‌లో వుండాలంటే.. బేరి పండును ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి. ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వలన ఊపిరితిత్తులు మూత్రాశయం పెద్దప్రేగు క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.