మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 15 మే 2023 (23:03 IST)

వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల ఏమవుతుంది?

fried onions
పెద్ద ఉల్లిపాయ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది సామెత. ఎందుకంటే, ఉల్లిపాయలు అంతగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను చాలామంది మాంసాహారంలో సైడ్ డిష్ గా వుపయోగిస్తుంటారు. వేయించిన ఉల్లిపాయల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలున్నాయి. అవేంటో తెలుసుకుందాము. వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
వేయించిన ఉల్లిపాయలను తింటుంటే ఎముకలు దృఢంగా మారుతాయి. వేయించిన లేదా కాల్చిన ఉల్లిపాయలు తింటే శరీరానికి కావలసిన క్యాల్షియం అందుతుంది. జీర్ణ సమస్యలను రాకుండా చేయడంలో వేయించిన ఉల్లిపాయలు దోహదపడుతాయి. శరీరంలోని విషపూరితాలను సమర్థవంతంగా తొలగించడంలో వేయించిన ఉల్లిపాయలు సాయపడతాయి.
 
వేయించిన ఉల్లిపాయల్లో క్యాల్షియం, ఫోలేట్లతో పాటు విటమిన్లు కూడా లభిస్తాయి. వేయించిన ఉల్లిపాయలు తింటుంటే గుండె జబ్బులు కూడా రావని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.