రక్తంలో వుండే ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు పనితీరు ఏమిటి?
రక్తంలోని ఎర్ర రక్త కణాలకు హిమోగ్లోబిన్ అనే పదార్థం వల్ల ఎరుపు రంగు కలిగి వుంటాయి. మిగతా కణాలలో లేని రీతిగా ఈ ఎర్ర రక్త కణాలలో ఇనుము, మాంసకృత్తులు వుంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువుని తీసుకునిపోయి అన్ని శరీరావయవాలకు చేరవేసి, ఆ తర్వాత అన్ని శరీరాంగాలలో వుండే ప్లాస్మా, జీవ కణాలలో మలినమైన కార్బన్ డై ఆక్సైడును ఊపిరితిత్తులలోకి పంపించి దానిని తిరిగి ప్రాణవాయువుగా తయారుచేయడానికి దోహదపడతాయి.
ఇక రక్తం లోని తెల్ల రక్త కణాలు శరీరాంగాములకు వ్యాధి సోకకుండా నిరోధిస్తూ కాపాడుతూ వుంటాయి. కొన్ని తెల్లరక్త కణాలు చుట్టుముట్టిన సూక్ష్మజీవులను చంపడంలో సహకరిస్తుంటాయి. మిగిలిన తెల్ల రక్తకణాలు శరీర రక్షక లేక ప్రతిరక్షకాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా చనిపోయిన కణములో లేదంటే బాహ్యపదార్థాల్లో వున్నట్లయితే వాటిని శరీరం నుంచి నిర్మూలించేందుకు దోహదం చేస్తుంది.