సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (22:55 IST)

కాలీఫ్లవర్‌ పవర్‌ఫుల్ బెనిఫిట్స్, ఏంటవి?

కాలీఫ్లవర్‌లో సహజంగా ఫైబర్, బి-విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లను అందిస్తుంది. ఇవి క్యాన్సర్ నుండి రక్షించగలవు. బరువు తగ్గేందుకు, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఫైబర్, జ్ఞాపకశక్తికి అవసరమైన కోలిన్, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది కాలీఫ్లవర్.

 
ఐతే చాలా తక్కువగా కాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ప్రత్యేకించి దీనిని ఎక్కువగా తింటేనే కడుపు ఉబ్బరం, అపాన వాయువు సమస్య వస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఉబ్బరం, అపానవాయువును పెంచుతాయి. అయినప్పటికీ ఈ ఆహారాలను మితంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదు.

 
ఇంకా ఏమిటంటే, కాలీఫ్లవర్‌ను డైట్‌ను జోడించడం సులభం. ఇది రుచికరమైనది, వండటం సులభం. అనేక వంటకాల్లో అధిక కార్బ్ ఆహారాలను ఇది భర్తీ చేస్తుంది.