శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 జనవరి 2020 (20:19 IST)

ఉదయాన్నే ఏం తింటున్నారు?

చాలామంది ఉదయం లేవగానే చేతికి ఏది అందితే దాన్ని తినేస్తారు. కొందరు స్వీట్లు తినేస్తారు. ఇలా ఏదిబడితే అది పరగడుపున తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందువల్ల ఉదయాన్నే ముందుగా ఒక గ్లాసుడు గోరువెచ్చని నీరు తీసుకోవాలి. దీనివలన జీర్ణశక్తికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ రోగాలను నివారిస్తుంది.
 
ఆ తర్వాత గుప్పెడు తృణధాన్యాలు మరియు ఒక పండునుగాని తీసుకోండి. అధిక క్యాలరీలు, అధిక కొవ్వు అంశాల వలన శరీరంలో షుగర్ శాతం పెరుగుతుంది. వాటిని ఇవి అదుపులో వుంచుతాయి. ఇక ఆ తర్వాత నూనె ఎక్కువగా ఉపయోగించని ఇడ్లీ లేదా మినప పప్పుతో ఉడికించే కుడుములు తినవచ్చు. ఇవి తేలికగా జీర్ణమవుతాయి.
 
ఒక కప్పు కాఫీ లేదా టీ జీవక్రియ పెంచడానికి సహాయపడుతుంది కానీ కాఫీ తాగటాన్ని ఓ అలవాటుగా చేసుకోకూడదు. ఎక్కువగా తీసుకోవటం వలన నిద్రలేమి ఏర్పడుతుంది. ఇది శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది.