ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.
జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.
మునగ ఆకుల టీ తాగితే బరువు తగ్గించుకోవచ్చు, రక్తపోటును, రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది.
మల్లెపూల టీ తాగితే రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది.
లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల దగ్గు, జలుబు, జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి తగ్గుతాయి.
దాల్చిన చెక్క టీ తాగితే శరీరంలోని వ్యర్థాలను తొలగించి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది.
గ్రీన్ టీ అధిక రక్తపోటును, కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.
జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి.