మంగళవారం, 27 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2024 (22:00 IST)

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

Dark Chocolate
డార్క్ చాక్లెట్ శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వాపును తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ చాక్లెట్ తింటే లాభాలేంటో తెలుసుకుందాము.
 
డార్క్ చాక్లెట్ తెల్ల రక్త కణాలను రక్తనాళాల గోడలకు అంటుకోకుండా నిరోధిస్తుంది.
డార్క్ చాక్లెట్ ధమనులలో కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధిస్తుంది.
డార్క్ చాక్లెట్ తినేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.
డార్క్ చాక్లెట్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గించగలదని తేలింది.
డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఒక రోజులో 30-40 గ్రాముల కంటే ఎక్కువ డార్క్ చాక్లెట్ తీసుకోరాదు.
వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.