మంగళవారం, 20 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (13:05 IST)

మైదాపిండిని తింటే.. షుగర్ లెవెల్ పెరుగుతుంది..

Maida
మైదా ఆరోగ్యానికి హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు మైదాను ఎప్పుడూ ముట్టుకోకూడదు. మైదా ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందని చెబుతున్నారు. గోధుమలలో లభించే పోషకాలు ఏవీ మైదాలో ఉండవు. 
 
మైదా అనేది గోధుమల నుండి సేకరించిన ఒక రకమైన ఆహారం. ఇది రసాయనాలను ఉపయోగించి బ్లీచ్ చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు.
 
ఇది తింటే షుగర్ లెవెల్ పెరిగి శరీరంలో కొవ్వు పెరిగి గుండె సమస్యలు వంటి వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాలో గోధుమలకు ఉన్నంత పీచు ఉండదని, ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుందని వైద్యులు తెలిపారు.