బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (23:13 IST)

ఆ మిరపకాయ తింటే ప్రాణాలు గోవిందా...

చూసేందుకు ఆ మిరపకాయ గోరంతే వున్నట్లు కనిపిస్తుంది. కానీ దాన్ని తింటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయలు ఘోస్ట్ పెప్పర్ మాత్రమే. వేల్స్ కు చెందిన రైతు మైక్ స్మిత్ ఘోస్ట్ పెప్పర్ కు మించిన మిరపకాయను పండించాడు. దీని

చూసేందుకు ఆ మిరపకాయ గోరంతే వున్నట్లు కనిపిస్తుంది. కానీ దాన్ని తింటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయలు ఘోస్ట్ పెప్పర్ మాత్రమే. వేల్స్ కు చెందిన రైతు మైక్ స్మిత్ ఘోస్ట్ పెప్పర్ కు మించిన మిరపకాయను పండించాడు. దీనికి డ్రాగన్ బ్రీత్ అనే పేరు పెట్టాడు. 
 
మిరప ఘాటును కొలిచే సాధనంలో దీని ఘాటు 2.48 మిలియన్ యూనిట్లు. ఐతే ఘోస్ట్ పెప్పర్ ఘాటు ఎంతంటే 2.2 మిలియన్ యూనిట్లు. డ్రాగన్ బ్రీత్ మిర్చిని ఒక్కటి తింటే ప్రాణాలు పోవడం ఖాయం. మరి ఇలాంటి మిరపకాయలను పండించడం ఎందుకు అనే సందేహం రావచ్చు. దీన్ని తినడానికి కాదు కానీ... ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట...