రోజూ శృంగారంలో పాల్గొంటే నరాల బలహీనత వస్తుందా?
నిత్యజీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదొకటి. స్వయంతృప్తి మార్గాలు అవలంభించే వారిలో నరాల బలహీనత వస్తుందని చాలామంది భయపడిపోతుంటారు. ఇంకా రోజూ శృంగారంలో పాల్గొనేవారిలో కూడా నరాలు చచ్చుబడతాయంటూ కొందరు భయపెడుతుంటారు. అయితే అలా చేయడం వల్ల నరాల బలహీనత ఏమాత్రం రాదంటున్నారు ఆ విభాగ నిపుణులు. నరాల బలహీనతకు శృంగారానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు.
నరాల బలహీనత అనేది మెదడుకు సంబంధించిందని, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన్నప్పుడు నరాల బలహీనత ఏర్పడుతుందనీ, అంతేతప్ప దానికీ శృంగారానికి ఎలాంటి సంబంధం ఉండదని వెల్లడిస్తున్నారు. ఇకపోతే స్వయంతృప్తి మార్గాలను అవలంభించేవారిలో నరాలు దెబ్బతింటాయి, చచ్చుబడతాయి, నరాల వీక్‌నెస్ వస్తుందనేది తప్పు అంటున్నారు. కోరికలు ఉన్న వాళ్ళు అలాంటి ప్రయోగాలు చేసినంతమాత్రాన తప్పేమీ లేదంటున్నారు.