సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 10 జనవరి 2019 (20:52 IST)

శృంగారం అనగానే పాపను లేపుతున్నాడు... కోర్కెతో రగిలిపోతున్నాను...

నాకు 24 ఏళ్లు. ఆయనకు 29 ఏళ్లు. మాకు ఓ పాప పుట్టింది. ఇటీవల మావారిలో వింత ప్రవర్తన కనబడుతోంది. రాత్రిపూట శృంగారం చేయాలంటే ముఖం చాటేస్తున్నారు. నాకు కోర్కెలు విపరీతంగా ఉండటంతో ఆయనను ప్రేరేపించేందుకు అనేక మార్గాలను ఆచరిస్తున్నాను. అదంతా ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. కానీ శృంగారం చేయమని అడిగితే మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. 
 
గట్టిగా ఆయనను ఎలాగైనా సన్నద్ధం చేద్దామనుకునేలోపు నిద్రపోతున్న మా పాపని లేపుతున్నాడు. పాపం ఆ పసిది... ఆ సమయంలో నిద్రలేపితే బిత్తరచూపులు చూస్తూ ఉంటోంది. ఇలాంటి స్థితిలో ఇక ఏం అడిగేదని నేనే విరమించుకుంటున్నా. ఐతే రాత్రివేళల్లో విపరీతంగా కోర్కె కలుగుతోంది. ఆ కోర్కెలను అణచుకోలేకపోతున్నాను. వాటిని అదుపుచేయగల మార్గాలేమైనా వున్నాయా.... మందులేమైనా వున్నాయా?
 
మీవారిలో కోర్కెలు తగ్గడానికి వివిధ కారణాలు ఉండిఉండవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పరీక్ష చేయించండి. అంతేకాదు హార్మోన్ల లోపం వల్ల కూడా ఇలా జరగవచ్చు. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలున్నప్పుడు శృంగారం పట్ల ఆసక్తి లేకుండా వుంటుంది. కాబట్టి మీ ఒత్తిడిని తట్టుకోలేక పాపను లేపితే ఏమీ చేయలేరని అలా చేస్తున్నట్లు అర్థమవుతోంది. ముందుగా మీవారిని వైద్యుడికి చూపించండి. పరీక్షల్లో ఏదైనా సమస్య ఉన్నదని తేలితే తగిన మందులు వాడవచ్చు. తద్వారా తిరిగి పూర్వం ఎలా తృప్తి చెందారో అలాంటి తృప్తిని పొందవచ్చు.