సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 మార్చి 2019 (20:15 IST)

ఆరింటితో సుఖమయ శృంగార జీవితం...

జీవితంలో భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడడానికి శృంగార సంబంధం కూడా కీలకపాత్ర పోషిస్తుంది అన్నది జగమెరిగిన సత్యం. కొన్ని అధ్యయనాల ప్రకారం లైంగిక సంబంధంలో తరచూ పాల్గొనే దంపతులు, ఎక్కువకాలం ఆరోగ్యంగా సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తేల్చాయి కూడా. తరచుగా పాల్గొనే వారిలో హాపీ హార్మోన్స్ విడుదల కారణంగా, పురుషులలో టెస్టోస్టీరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిరూపించబడింది. 
 
ఇటీవలికాలంలో లైంగిక పరమైన సమస్యలతో ఆందోళన పడుతున్నారు చాలామంది. లైంగిక పటుత్వం కోల్పోతుందని ఎటువంటి ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు, ఇలాంటి  సమస్యలు ఎదుర్కొంటున్న జంటలు లైంగిక శక్తిని పెంచుకోవడానికి సూచించబడిన, కొన్ని మార్గాలను అనుసరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కొన్ని పానీయాలు ఖచ్చితంగా లైంగిక శక్తిని పెంచడమే కాకుండా, మెరుగైన లైంగిక జీవితాన్ని సైతం సులభతరం చేస్తాయి.
 
1. అనేక పరిశోధనల్లో, అలోవెరా రసం టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపర్చగలదని తేలింది. ఇది పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, కోర్కెలను ప్రేరేపిస్తుంది. అలోవేరా రసం ఆరోగ్యాన్ని పెంచగలిగే, అద్భుతమైన పోషకాలకు మూలం. ఇది శరీరాన్ని ఉత్తేజపరచడమే కాకుండా, లైంగిక పటుత్వాన్ని కూడా పెంచుతుంది.
 
2. స్తంభనలను పెంచగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎల్- సిట్రిల్లైన్ అని పిలిచే అమైనో ఆమ్లాలలో పుచ్చకాయలలో అధికంగా ఉంటాయి. పుచ్చకాయ రసం లైంగిక సామర్ధ్యం బలోపేతం చేయడానికి సహాయపడే జననేంద్రియాలకు, రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.
 
3. ఆహారంలో అల్లం రసాన్ని జోడించడం ద్వారా, జీవితానికి అదనపు మసాలాలను జోడించండి. అల్లం రసం ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది లైంగిక పటుత్వం తగ్గడం అకాల స్ఖలనం వంటి సమస్యలను తొలగించి శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
4. లైంగిక శక్తిని పెంచుకోవడంలో అరటిపండ్లు అత్యంత ప్రభావవంతమైనవిగా ఉంటాయి. బ్రోమలైన్ అని పిలువబడే ఎంజైమ్ కారణంగా అరటిపండు సంభోగం విషయంలో అద్భుతంగా సహాయపడగలదని చెప్పబడింది. అరటిపండులోని అదనపు విటమిన్లు మరియు ఖనిజాలు సెక్స్ లైంగిక హార్మోన్ల ఉత్పత్తిలో సహాయపడుతూ శరీరానికి తక్షణశక్తిని ఇచ్చేందుకు సహాయపడుతాయి. 
 
5. తృణధాన్యాలు మరియు బాదం వంటివి, పురుషుల్లో హార్మోన్ల ఆరోగ్యకరమైన ఉత్పత్తికి కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి ఆరోగ్యకర కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలకు గొప్ప మూలంగా ఉంటాయి. బాదంపాలు మహిళకు లైంగిక ప్రేరణగా పనిచేస్తుంది.
 
6. తేనె టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. వెనిలాతో తేనె చేర్చినప్పుడు, పురుషులు మరియు స్త్రీలలో ఒక శక్తివంతమైన కామోద్దీపనను ప్రేరేపించగలదు. అంతేకాకుండా లైంగికచర్య ఎక్కువసేపు కొనసాగడంలో సహాయపడుతుంది.