శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (14:25 IST)

ఆఫీసుకి లాంగ్ లీవ్ పెట్టాడు... శృంగారంతో హూనం చేస్తున్నాడు... అతను ఎడిక్ట్ అయ్యాడా?

ఆఫీసుకు వెళ్లడం, వెళ్లకపోవడం ఆయన ఇష్టం. ఎందుకంటే మాది బాగా ధనవంతుల కుటుంబం. అందుకే ఆఫీసుకి వెళితే వెళతారు లేదంటే లేదు. ఇటీవలే పెళ్లయింది. అప్పట్నుంచి ఆఫీసుకు వెళ్లడం బాగా తగ్గించారు. లాంగ్ లీవ్ పెట్టేశాడు. పొద్దస్తమానం నాతో శృంగారం చేస్తూ వళ్లు హూనం చేస్తున్నారు. ఇంట్లోవాళ్లు ఏమైనా అనుకుంటారేమోనని నాకు ఇబ్బందిగా ఉంది. ఆఫీసుకెళ్లమంటే, తనకు ఇదంటేనే ఎక్కువ ప్రీతి అని, తనకు ఇష్టమయినప్పుడు వెళతానంటూ చెపుతున్నారు. ఈయనేమైనా శృంగారానికి ఎడిక్ట్‌గా మారిపోయారేమోనని నాకు అనుమానంగా ఉంది...?
 
మీరు అనుకునేది వాస్తవం కాదు. పెళ్లయిన కొత్తలో చాలామంది పురుషులు ఇలాగే ఉంటారు. శృంగార సుఖాన్ని పూర్తిస్థాయిలో అనుభవించాలనే తలంపుతో ఇలా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా సంతోషంగా దాంపత్య సుఖాన్ని చవిచూడండి. కొన్నిరోజులకు ఆయనే మెల్లగా ఆఫీసు కార్యక్రమాలకు సజావుగా వెళతారు.