మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (13:55 IST)

నేనుండగా నా భార్య ఎందుకు స్వయంతృప్తి చేస్కుంటోంది...

మాకు ఓ పాప పుట్టింది. బిడ్డకు ఏడాది దాటింది. నా భార్యాబిడ్డల ఆరోగ్యం కోసం నేను నిరంతరం జాగ్రత్తగా ఉంటున్నాను. ఆమె ఆరోగ్యపరమైన చిక్కులు ఎదుర్కొంటుందేమోనని బిడ్డ పుట్టాక 6 నెలలు వరకూ శృంగారంలో పాల్గొనలేదు. ఆ తర్వాత క్రమంగా శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఆమె ఎందుకో విముఖత చూపిస్తూ వచ్చింది. ఈమధ్య ఆమె స్వయంతృప్తి పద్ధతి పాటించడాన్ని గమనించాను. నాతో శృంగారంలో పాల్గొనకుండా ఇలా ఎందుకు చేసుకుంటుందో అర్థంకావడంలేదు...
 
పిల్లలు కలిగాక తల్లిగా స్త్రీలో చాలా మార్పులు వస్తాయి. బిడ్డ తోటిదే లోకంగా ఆమె పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో శృంగారంలో పాల్గొనాలనే కోరిక కూడా అంతగా ఉండదు. ఇకపోతే... మీ అంతట మీరుగానే ఆమెతో శృంగారానికి దూరమయ్యారు. ఇప్పుడు కావాలని మీరే అంటున్నారు కాబట్టి అందుకు తగిన విధంగా ఆమెను సమాయత్తం చేయాల్సి ఉంటుంది. 
 
శృంగార పరంగా ఆమెను సిద్ధం చేసిన తర్వాత తదుపరి చర్యకు ఉపక్రమించేందుకు ప్రయత్నించాలి. ఇక స్వయంతృప్తి అనేది చాలామంది స్త్రీలు అనుభవించేదే. కాబట్టి దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మగవాళ్లలో కూడా భాగస్వామితో శృంగారం చేస్తున్నా స్వయంతృప్తి పద్ధతులు పాటించేవారు కూడా వుంటారు.