1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 31 అక్టోబరు 2018 (18:43 IST)

భార్య సహకరించడం లేదు.. శృంగార కోర్కెతో చచ్చిపోతున్నా...

అనేక మంది పురుషులకు శృంగార కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. ఆ కోర్కెలకు అనుగుణంగా వారు భార్యతో శృంగార కార్యక్రమంలో పాల్గొనాలని తహతహలాడుతుంటారు. అయితే, పడక గదిలో భార్య మాత్రం ఏమాత్రం సహకరించదు. ప్రతి రోజూ ఈ విధంగా ప్రవర్తించే భార్యలు లేకపోలేదు. దీంతో భర్తలకు వయస్సు మీదపడటంతో పాటు.. కోర్కెలు కూడా తగ్గిపోతుంటాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యాయత్నాలకు కూడా పూనుకుంటుంటారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య పడగ గదిలో మాత్రం ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తుందో మానసిక నిపుణులను సంప్రదిస్తే వారు కింది విధంగా ఆభిప్రాయపడుతున్నారు. 
 
స్త్రీ పురుషులిద్దరిలో శృంగార సమస్యలు ఏర్పడడానికి శారీరక కారణాలు, వ్యాధులు లేనప్పుడు భాగస్వామి ప్రవర్తనే ప్రధాన కారణంగా నిలుస్తుందని, ఒకవేళ శృంగార సమస్యలు ఉన్నా వాటి పరిష్కారంలో భాగస్వామి సహకారం లేకున్నా అవి ఎక్కువవుతాయని చెపుతున్నారు. నిరంతరం ఘర్షణ పడే దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి, అశాంతికి లోనైనపుడు మనసే కేంద్రంగా పనిచేసే సాధారణ శృంగార చక్రం కలిగించే రసాయన, నాడీ, హార్మోన్ స్పందనలు కుంటుపడతాయని చెపుతున్నారు. 
 
దీనివల్ల మగవారికి స్తంభన లోపం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాగే, స్త్రీలలో ఫ్రిజిడిటీ వంటి సమస్యలు కలుగుతాయని, పురుషులలో ఆధిపత్య ధోరణులు స్త్రీలలో ఆత్మనూన్యత, డిప్రెషన్‌కు దారితీసి వారిలో శృంగారంపై ఆసక్తిని తగ్గించి వేస్తాయని పేర్కొంటున్నారు. వరకట్న వేధింపులు, ఇంట్లో అత్త, ఆడబిడ్డల ఆరళ్లు, చదువు - ఉద్యోగాలు కొనసాగించ లేకపోవడం, పిల్లల పెంపకం వంటివి స్త్రీలలో డిప్రెషన్‌ను కలిగిస్తాయంటున్నారు. భార్యాభర్తలు పరస్పరం అనుమానించుకోవడం కూడా ఈ పరిస్థితిని ఎక్కువ చేస్తుందంటున్నారు. 
 
పురుషులలో భార్య సహకరించకపోవడం, తిరస్కారం వల్ల ఆత్మనూన్యతకు దారి తీసి పర్‌ఫ్మాన్స్ ఆంగ్జైటీతో శృంగార సమస్యలు తలెత్తుతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు.