1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 16 అక్టోబరు 2014 (20:21 IST)

దుస్తులు మార్చుకునేటపుడు తలుపు సందుల్లోంచి తొంగి చూస్తున్నాడు. ఎందుకని...?

నగరంలో పోటీ పరీక్ష రాయాలంటే 10 రోజులపాటు మా దూరపు బంధువుల అబ్బాయిని మా ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఆయన ఆఫీసుకు వెళ్లాక ఆ కుర్రాడు నేను మాత్రమే ఉంటున్నాం. అతడి గదిలో అతడు చదువుకుంటుంటాడు. ఓ రోజు నేను స్నానం చేసి బెడ్రూంలో దుస్తులు మార్చుకుంటుండగా తలుపు సందుల్లోంచి ఎవరో చూస్తున్నట్లనిపించింది. 
 
కొద్దిసేపటి తర్వాత తలుపు తీసి చూస్తే ఆ కుర్రాడు తడబడుతున్నాడు. ఐతే ఆరోజు నేనేమీ పట్టించుకోలేదు. కానీ మరుసటి రోజు కూడా అదే సమయానికి అతడు తలుపుల వద్ద నిలబడి తొంగితొంగి చూస్తున్నాడు. కానీ నేను ఆ రోజు స్నానం చాలా ముందుగానే ముగించాను. దాంతో నేను హాలులో నిలబడి అతడి వెనుక నుంచి పిలిచేసరికి ఉలిక్కిపడిపోయాడు. అసలెందుకు అతడలా చూస్తున్నాడు...?
 
యవ్వనంలో యువతీయువకులకు సెక్స్ కోర్కెలు సహజంగా తలెత్తుతుంటాయి. టీనేజ్ వయసుకు వచ్చిన తర్వాత వారు సెక్స్ పరమైన విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాగే అబ్బాయిలయితే అమ్మాయిల వైపు అమ్మాయిలైతే అబ్బాయిల వైపు ఆకర్షణ చెందుతుంటారు. మీరు చెప్పిన కుర్రాడు కూడా ఇలాంటి సెక్స్ ఆలోచనలతోనే ఇలాంటి పనులు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ స్త్రీలు దుస్తులు మార్చుకునేటపుడు అలా చూడకూడదనే సంస్కారం అతడిలో లేదని కూడా తెలుస్తోంది. మీరు ఒంటరిగా ఉండటం శ్రేయస్కరం కాదు. వెంటనే అతడిని పంపించి వేయడమో లేదంటే మీకు తోడుగా మరెవ్వరైనా ఉండటమో చేయడం మంచిది.