1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By IVR
Last Modified: మంగళవారం, 22 జులై 2014 (16:42 IST)

కలలో నా ప్రేయసి... రోజూ రాత్రి వీర్యం పోతోంది... ఏం చేయాలి...?

నేను, నా గర్ల్ ఫ్రెడ్ డేటింగ్ చేశాం. ఐతే ఆమెకు అనుకోకుండా ఫారిన్ ఆఫర్ దొరికింది. దాంతో జాబ్ చేసేందుకు అక్కడికి వెళ్లిపోయింది. ఇక అప్పట్నుంచి నా పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. పగలు ఆఫీసు పనులతో అలసిపోతున్నాను. 
 
రాత్రిపూట కలలో నా ప్రేయసి వస్తోంది. ఆమెతో సెక్స్ చేసినట్లు కల గంటున్నాను. ఆ సమయంలో వీర్యం స్ఖలిస్తున్నాను. ఇదంతా నిద్రలోనే జరిగిపోతోంది. నిద్ర లేచిన తర్వాత నాకు నీరసంగా ఉంటోంది. ఇదేమైనా రోగమేమో అని భయంగా కూడా ఉంటోంది. ఎందుకిలా జరుగుతోంది...?
 
స్లీప్ ఎమిషన్, నైట్ ఫాల్, స్వప్న స్ఖలనం లేదంటే వెట్ డ్రీమ్స్ వంటివి పురుషుల శరీరంలో సహజంగా సంభవిస్తుంటుంది. ఐతే రతిలో పాల్గొనేవారికి, హస్త ప్రయోగం చేసుకునేవారిలో ఇది కనబడటం అరుదుగా ఉంటుంది. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో వీర్య అనేది తయారవుతూనే ఉంటుంది. ఇలా తయారవుతున్నప్పుడు కొంత ఉత్పత్తి అయిన వీర్యం కొన్నిసార్లు బయటకు నెట్టబడుతుంది. 
 
దీనికితోడు ప్రియురాలికి సంబంధించిన ఊహలు కూడా మనసులో తిరుగాడుతున్నప్పుడు నిద్రలో ఉన్నప్పటికీ వీర్యం గ్లాసు నిండిన తర్వాత నీళ్లు ఎలా బయటకు పోతాయో అలాగే వీర్యం కూడా బయటకు ఒలకబడుతుంది. ఇలా వీర్యం స్ఖలించినపుడు కొద్దిగా నీరసంగా కూడా ఉండటం సహజమే. దాని గురించి ఆందోళన చెందనక్కర్లేదు.