గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 జూన్ 2019 (21:28 IST)

సపోటా పండ్లను ఎందుకు తినాలో తెలుసా?

మనకు ప్రకృతి పరంగా, సహజసిద్ధంగా లభించే వాటిల్లో సపోటా అద్భుతమైన రుచిని అందించే పండ్లలో ఒకటి.  ఇది అధిక పోషకాలు కలిగిఉన్న  పండు. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్, టన్నిన్ లు సమృద్ధిగా ఉన్నాయి. దీని రుచి తియ్యగా ఉండడం వల్ల, జ్యూస్‌లలో బాగా ఉపయోగిస్తారు. సపోటాలోని వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
 
1. సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్‌ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. సపోటా విటమిన్ ఎ ని అధికంగా కలిగి ఉంటుంది. విటమిన్ ఎ వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందువల్ల, మంచి దృష్టిని పొందడానికి సపోటా పండు బాగా ఉపయోగపడుతుంది.
 
2. సపోటా టన్నిన్‌ని అధికంగా కలిగి ఉండడం వల్ల ముఖ్యమైన యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఎసోఫాగిటిస్, పేగు శోధము, చికాకుపెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నివారణ ద్వారా జీర్ణ వాహిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఎటువంటి వాపునైనా, నొప్పినైనా తగ్గించడం ద్వారా మంటను కూడా తగ్గిస్తుంది.
 
3. ఇందులో ఉండే విటమిన్ ఎ, బి శరీరంలోని శ్లేష్మ క్రమీకరణకు, చర్మం ఆరోగ్య నిర్మాణ నిర్వహణకు సహాయపడతాయి. సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు కాన్సర్ ను౦చి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ నుండి రక్షణను అందిస్తుంది.
 
4. సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఉధృతిని, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల, ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది.
 
5. ఇందులో పాలీఫెనోలిక్ అనామ్లజనకాలు ఉండడం వల్ల, సపోటా పండు అనేక యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్లు బాక్టీరియా మనవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. పొటాషియం, ఇనుము, ఫోలేట్, నియాసిన్, పాంతోతేనిక్ జీర్ణ వ్యవస్థకు సరైన చర్యలైతే విటమిన్ సి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది.
 
6. సపోటా పండు చర్మం కాంతివంతంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచడం వల్ల, చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల, సపోటా పండు తినడం అనేది చర్మానికి ఎంతో మంచిది.
 
7. సపోటా విత్తనాలను ఆముదంతో కలిపి, ఒక పేస్ట్‌లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మరుసటి రోజు తలస్నానం చేయండి. దీనివల్ల మీ జుట్టు మృదువుగా ఉండి, చుండ్రు సమస్యను నియంత్రిస్తుంది.