శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 19 జనవరి 2019 (21:13 IST)

ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ జీవితంలో రాదు..!

సమయానికి భోజనం చేయకుండా పోవడం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ట్రిక్ కారణంగా కడుపు నొప్పి.. కడుపులో మంట వస్తుంది. అలా రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్‌కు దూరంగా ఉండాలంటే రెండు చిట్కాలను పాటిస్తే చాలా సులువుగా అధిగమించవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
 
సోంపు, వాము ఒక్కో స్పూన్ తీసుకుని మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు మజ్జిగలో పోసుకుని కలుపుకుని తాగాలి. అలాగే రెండవ రెమెడీ కూడా పాటించవచ్చు. పసుపు ఒక స్పూన్, జీరా పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకుని ఆ మిశ్రమంలో పిండి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యకు దూరమవ్వడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.