సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (18:32 IST)

రోజుకు మూడు అరటి పండ్లను తీసుకుంటే?

శరీరంలో పొటాషియం శాతం తగ్గించి, గుండెపోటును నియంత్రించుకునేందుకు అరటి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. రోజూ మూడు అరటి పండ్లను తినేవారిలో హృద్రోగ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. 
 
రోజూ ఉదయం అల్పాహారం అయ్యాక, మధ్యాహ్నం భోజనానంతరం, రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడు అరటి పండ్లు తినడం వల్ల శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించుకోవచ్చు. మెదడు, రక్త సంబంధింత రోగాలను తగ్గించుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. 
 
నట్స్‌, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారం తీసుకోవడం కంటే ఈ పద్ధతి పాటిస్తే మంచిదని వైద్యులు చెప్తున్నారు. ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్‌ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. 
 
ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉండటం వలన కంటి చూపుకు కూడా చాలా పనిచేస్తుంది. ఈ పండు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఎసిడిటిని ఎక్కువగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.